కరీంనగర్‌లో నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమం

పయనించే సూర్యుడు, డిసెంబర్ 28( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) చెరుకుపల్లి రాకేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ఇందిరమ్మ కాలనీ గ్రామ సర్పంచ్ గడ్డం రచన మధుకర్ (చోటు)ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సన్మానించారు.
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గెలుపొందిన సర్పంచులందరిని సన్మానించి, గ్రామాల అభివృద్ధి బాధ్యత మీ భుజాలపైనే ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్, జిల్లా ఆర్టీఏ సభ్యులు సంగీతం శ్రీనాథ్ (వింకు), పడాల రాహుల్‌తో పాటు అన్ని బ్లాక్, మండల, పట్టణ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.