పయనించే సూర్యుడు డిసెంబర్ 28 నాగర్ కర్నూల్ జిల్లా రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా వీపనగండ్ల (కల్వరాల) పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని నిరూపిస్తూ, మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ( సిఎంఅరఫ్ ) చెక్కులు మంజూరయ్యాయి. జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ ప్రత్యేక చొరవ చూపి ఈ చెక్కులు మంజూరు చేయించారు. నేడు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప సర్పంచ్ తడకల రంగమ్మ, వార్డు సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులు కలిసి లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారుల వివరాలు: గురుక అశోక్ కుమార్: ₹60,000/- సుజాత (భర్త రంజిత్): ₹30,000/- పాశమోని రాముడు: ₹15,500/- బరికెల అలివేల (భర్త కృపాకర్): ₹16,000/- మొత్తం మంజూరైన నిధులు: ₹1,21,500/- కార్యక్రమంలో పాల్గొన్న వారు: ఈ కార్యక్రమంలో 11వ వార్డు సభ్యులు బందేల శ్రీకాంత్, 6వ వార్డు సభ్యులు పొచమోనీ ఆంజనేయులు, 7వ వార్డు సభ్యులు పూరు సాయి ప్రసాద్, 8వ వార్డు సభ్యులు పోచమోనీ సరిత మల్లేష్, 9వ వార్డు సభ్యులు పుట్ట లక్ష్మీ మధు పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామస్తులు ఈ పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఆపద సమయంలో ఆర్థిక సాయం అందించిన మంత్రి జూపల్లి కృష్ణారావుకి మరియు సహకరించిన అధికారులకు లబ్ధిదారులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.