కాటమయ్య రక్షణ కిట్టును ప్రతి ఒక్కరు వాడాలి

★ కేజీ కేసు జిల్లా కార్యదర్శి బాల్య వెంకట మల్లయ్య

పయనించే సూర్యుడు డిసెంబర్ 28 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో జనగామ జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జిల్లా కో- ఆర్డినేటర్ బాల్నే వెంకట మల్లయ్యకాటమయ్య రక్షణ కవచం ట్రైనింగ్ 110 మందికి ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన కాటమయ్య రక్షణ కవచం ను ఇచ్చిన ప్రతి ఒక్క గీత కార్మికులు వాడాలి ఇప్పటివరకు జనగామ జిల్లాలో కాటమయ్య రక్షణ కిట్లను 2,275 మంది గీత కార్మికులకు పంపిణీ చేయడం జరిగిందని ఇచ్చిన కిట్లను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తాడి చెట్టు నుండి పడిన ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుందనిఇచ్చిన ప్రతి ఒక్క గీత కార్మికులు వాడాలని వారి కుటుంబానికి భరోసాగా ఉంటుంది కోరుతున్నాను ఈ కార్యక్రమంలో కేజీ కేఎస్.రాష్ట్ర కమిటీ సభ్యులు కమ్మగాని నాగన్న , ఎక్సైజ్ సీఐ సంతోష్ రెడ్డి హోంగార్డ్స్ మండల అధ్యక్ష కార్యదర్శులు కమ్మగాని పరుశరాములు తాళ్లపల్లి మదర్ట్రైనర్స్కుర్ర ఉప్పలయ్య కంకటి రాజయ్య బాల్నే కార్తీక్ వడ్లకొండ వెంకటేష్ మూల వైకుంఠం పాల్గొన్నారు