కాలనీ వాసులతో కలిసి కాలనీలో పాదయాత్ర చేసిన నార్నె శ్రీనివాస రావు.

పయనించే సూర్యుడు,డిసెంబర్ 28 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ కాలనీలో గల పలు సమస్యలు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, శానిటేషన్, హార్టికల్చర్, జలమండలి విభాగం, వీధిదీపాలు, విద్యుత్ అధికారులతో, కాలనీ వా సులతో కలిసి కాలనీలో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీ వారి విజ్ఞప్తి మేరకు కాలనీలో పర్యటించి,సమ స్యలను తెలుసుకొని వాటిని తక్షణ మే పరిష్కరించాలని అధికారులకు చెప్పడం జరిగింది, అలానే ప్రతి చిన్న సమస్య గురించి చర్చించి, వెంటనే సమస్యలు పరిష్కారం జరిగేలా చూడాలని అధికారులకు చెప్పడం జరిగింది అలానే పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకుమా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంత లలో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తామని నార్నె శ్రీనివాస రావు తెలియ చేశారు.ఏ చిన్న సమ స్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాల నీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీల ను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళు తు సమస్య రహిత ఆదర్శవంతమై న కాలనీ లుగా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని,ప్రజలకు స్వచ్ఛ మైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతా వరణం కలిపిస్తామని నార్నె శ్రీనివా సరావు చెప్పడం జరిగినది, అలానే అన్నివే ళలా ప్రజలకు అందుబాటు లోకి ఉంటా నని, మెరుగైన ప్రజా జీవనా నికి అన్ని రకాల మౌలిక వసతుల కల్ప నకు తనవంతు కృషి చేస్తాన ని,అదే విధంగా హైదర్ నగర్ డివి జన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజ న్గా తీర్చిదిద్దుతామని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ ఎంసి ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, హార్టికల్చర్ విభాగందా సు,శానిటేషన్ విభాగం రమేష్, వీధిదీ పాల విభాగం సుధాక ర్, జ లమండలి సూపర్వైజర్ నరేం ద్ర సునీల్, వి ద్యుత్ లైన్మెన్ పాండు, కాలనీ వాసులు నాయకులు తదిత రులు పాల్గొన్నారు.