పయనించే సూర్యుడు 28-12-2025 ఎన్ రజినీకాంత్:- మెంతా తుఫాన్ దాటికి దెబ్బతిన్న కెనాల్ కాలువను శనివారం భీమదేవరపల్లి మండలం కొత్తపెళ్లి సర్పంచ్ ప్రదీప్ అధికారులతో కలిసి పరిశీలించారు.. గట్లు తెగిపోయిన ప్రాంతాలను ఈఈ, డీఈ, కాంట్రాక్టులకు చూపించి, సాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా మరమ్మతులు చేపట్టాలని కోరారు.. పనులలో నాణ్యతను పాటించి, రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సర్పంచ్ ప్రదీప్, ఆధరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..