కిర్లంపూడిలో ముత్తూట్ మినీ ఫైనాన్షియల్ లిమిటెడ్ బ్రాంచ్ సేవలు నేటి నుండి ప్రారంభం

పయనించే సూర్యుడు డిసెంబర్ : 28 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రత్తిపాడు వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. మండల కేంద్రం కిర్లంపూడిలో ముత్తూట్ మినీ ఫైనాన్షియల్ లిమిటెడ్ నూతన బ్రాంచ్‌ను శనివారం ఆయన రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.ఈ కార్యక్రమం జోనల్ మేనేజర్ నిరంజన్ కుమార్, జోనల్ అడ్మిన్ సత్యం, బ్రాంచ్ మేనేజర్ వేణు కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ముత్తూట్ మినీ ఫైనాన్స్‌కు 985 బ్రాంచ్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు. చిన్నతరహా వ్యాపారవేత్తలకు అతి తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయడంతో పాటు, ఆరోగ్య బీమా వంటి పథకాల ద్వారా ఖాతాదారులకు పలు లబ్ధులు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ వెంకట్రావు, మార్కెటింగ్ మేనేజర్ శ్రీ వంశీ, మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు, శరకణం భద్రం, బుద్ధ సాయి సాయిబాబు, శరకణం తాతాజీ, ఐజి కురుమళ్ళ చిన్ని, కె. వెంకటరమణ, సత్తిబాబు, పి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.