పయనించే సూర్యుడు న్యూస్ నల్గొండ.డిసెంబర్ 28. నల్లగొండ జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మత్తులో రోడ్లపై వేగంగా, ఇష్టారాజ్యాంగా వాహానాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులు కాకూడదు. జిల్లా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అప్రమత్తమై పక్కా కార్యాచరణతో రంగంలోనికి దిగుతున్నారు. నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఏవరైన అతిక్రమించినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా, యస్పి శరత్ చంద్ర పవార్ ఐ.పి.యస్. హెచ్చరించారు. ఎక్కడకూడా పోలీస్ అనుమతి లేకుండా న్యూ ఇయర్ కార్యక్రమములు నిర్వహించరాదు. ఫామ్ హౌస్, క్లబ్స్ మరియు గేటెడ్ కమ్యూనిటీలో అనుమతిలేకుండా నూతన సంవత్సర కార్యక్రమాలు నిర్వహించరాదు. వాటిని కూడా పరిమితి మించకుండా సౌండ్ వాడరాదు. ప్రజలను భయాందోలనకు, ఇబ్బందులకు గురి అయ్యే విధంగా క్రాకర్స్ మరియు " ఆర్.కె స్ట్రా" సౌండ్ సిస్టమ్ లేదా అత్యధిక మొతాదులో గల సౌండ్ సిస్టమ్ (డి.జె ) ఏర్పాట్లు నిషేధించడం జరిగింది. ఎందుకంటే కొన్ని ప్రదేశాలలో వృద్ధులు లేదా అనారోగ్యంతో బాదపడుతున్న వారికి ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశంగలదు. ట్రాఫిక్ నిబ్బంధనలు : నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ,మిర్యాలగూడ దేవరకొండ,డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలను ఎక్కువ నిర్వహించే అవకాశం ఉంటుంది. కావున ఈ వేడుకల సందర్భంగా ప్రతీ వాహనాదారుడు తూ.చ తప్పకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించేలా పోలీసు సిబ్బంది చర్యలు తీసుకోనున్నారు. నల్లగొండ జిల్లా పరిధిలో ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలు అమలు తీరును మరింత పటిష్టంగా అమలుపర్చాల్సి ఉంటుంది. ప్రధాన జంక్షన్లలో డ్రంకన్ డ్రైవ్ మరియు రోడ్లపై గస్తీ నిర్వహించడం జరుగుతుంది. స్పెషల్ పార్టీలు : అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో సాయంత్రం 6 గంటల నుండి ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి వాహానాల తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టనున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా ఫోటో గ్రాఫి మరియు వీడియో గ్రాఫీలు తీసిన తర్వాత వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందని, పోలీస్ వారి నిబంధనలు ఎవ్వరయిన అతిక్రమించిన వారిపై చట్టరిత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పోలీస్ వారి సూచనలు : 1) బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగడం నిషేదం 2) మైనర్లు, యువకులకు బైకులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కావున తల్లి దండ్రులు మైనర్ యువకులకు బైకులు ఇవ్వవద్దు. పట్టుబడితే మైనరు పై మరియు వాహనం. యాజమానిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. 3) త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహానాలు నడపడం శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వాహానాలు సీజ్ చేయనున్నారు. 4) అధిక వేగంతో వాహానాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. కావున నెమ్మదిగా నడపాలి. 5) మద్యం తాగి వాహానాలు నడపొద్దు. జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తాము. 6) గుంపులు గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తే తిరగడం, వాహానాలతో ర్యాలీగా వెళ్లడం చేయరాదు.. గమనిక: జిల్లా ప్రజలు పైన తెలియ జేయబడిన నిబంధనలు తప్పకుండా పాటిస్తూ సంబంధిత పోలీస్ వారికి సహకరించ గలరని మా మనవి.