పయనించే సూర్యుడు డిసెంబర్ 28 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలు అశ్వారావుపేట మండల కేంద్రంలోని రైతు వేదిక నందు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒకరినొకరు గౌరవిస్తూ ఐకమత్యంతో జీవించాలని పిలుపునిచ్చారు అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని క్రైస్తవ మైనారిటీ సంక్షేమానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యతనిత్సోoదని తెలిపారు ఈ కార్యక్రమాలలో రెండు మండలాల అధ్యక్షులు మద్దిశెట్టి సత్య ప్రసాద్ తుమ్మా రాంబాబు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాకా రమేష్ ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు దిశా కమిటీ సభ్యురాలు సొంగా ఏసుమణి దమ్మపేట ఇంచార్జ్ తహసీల్దార్ వాణి అశ్వారావుపేట తహసీల్దార్ రామకృష్ణ ఎంపీడీవో అప్పారావు దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి ఉప సర్పంచులు వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు