గచ్చిబౌలి స్టేడియంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు

పయనించే సూర్యుడు డిసెంబర్ 28 (మల్కాజిగిరి ఇంచార్జి రఘుపతి ):శనివారం రోజున గచ్చిబౌలి స్టేడియంలో గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు 7209 నృత్య కళాకారులు పాల్గొనడం జరిగింది. ఇందులో డా. రఘుపతి శిష్యులు కూచిపూడి నృత్యం లో చాలా చక్కగా నృత్యుంచారు. 7209 మంది కళాకారులు ఓకే పాట పై అందరు ఒకేసారి నాట్యం చేసి గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు కి దోహద పడ్డారు. దీని ముఖ్య అతిధులు సినిమా కళాకారులు మరియు కూచిపూడి గ్రామానికి చెందిన గురువులు పశుపతి మరియు నారాయణ పాల్గొన్నారు. ఈ కూచిపూడి కళా వైభవం 2 కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. డా. రఘుపతి మాట్లాడుతూ సాక్షాత్తు ఆ పరమశివాపార్వతులు నాట్యమే ఈ వరం నాట్య గురువులకి మరియు నాట్య శిష్యులను కి అందించ్చాడు. కాబట్టి ఈ కూచిపూడి నాట్యన్ని మనం అందరం కాపాడాలి. ఈ నాట్యన్ని క్రమశిక్షణతో నేర్చుకుంటేనే వస్తుంది అని చెప్పాడు. అదేవిదంగా తల్లి దండ్రులు సహకరించనందుకు నమస్కారాలు తెలియపరుస్తూ ఇటు నాటకారులు అటు తల్లి దండ్రులు క్రమశిక్షనతో ఉంటేనే అన్ని ఆ పరమశివా పార్వతులు మనల్ని ఆశీర్వదిస్తాడు.