
పయనించే సూర్యడు గజ్వెల్ డిసెంబర్ 28గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా టీ యు డబ్ల్యూ జె హెచ్ 143అధర్యంలో శనివారం రోజున నూతన జి ఓ వెంటనే రద్దు చేయాలి అంటూ ర్యాలీ ధర్నా నిర్వహించరూ ఈ సందర్బంగా జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252 ను వెంటనే సవరించాలని సిద్దిపేట జిల్లా టియుడబ్ల్యూజే H 143 జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మానుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన వ్యక్తం చేసారు. అనంతరం ( AO ) అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో లో 23 వేల అక్రెడిటేషన్ కార్డులివ్వగా, కొత్త జీవోతో అవి 10 వేలకు పైగా కార్డులకు కోత పడే ప్రమాదం ఉందని జర్నలిస్ట్ లు ఆందోళన వ్యక్తం చేశారు.