గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా సుదర్శన హోమం

పయనించే సూర్యుడు న్యూస్ 28-12-25, నాగరాజు రుద్రారపు సూర్యాపేట టౌన్ రిపోర్టర్, గోవింద మాల భక్తుల కోలాహలం ముడుపులు కట్టి తిరుమల బయలుదేరి పసుపు వర్ణ శోభితం భానుపురి పట్టణం సూర్యాపేట పట్టణం గత మూడు రోజులుగా గోవింద నామస్మరణలతో మారుమోగింది మండల పూజ శోభాయాత్ర పూర్తి చేసుకున్న గోవింద స్వాములు శనివారం ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి జరుపుకొని ముడుపులు నెత్తిన ఎత్తుకొని తిరుమల బయలుదేరారు గోవింద స్వాములు. గోవింద నామస్మరణలతో సుదర్శన నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది ముక్కోటి ఏకాదశి రోజున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనంతో గోవిందమాల దీక్ష పూర్తి అవుతుంది అని వేణుగోపాల చార్యులు తెలిపారు సుదర్శన హోమ కార్యక్రమంలో గుండా శ్రీనివాస్, దంతాల నాగరాజు, ఫణికుమార్, బూర నాగరాజు వెంకటాచారి దంతాల శేఖర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూర్ణాహుతి అనంతరం గోవింద స్వాములకు భక్తులకు తదియారాధన అన్న ప్రసాదం అందజేశారు.