పయనించే సూర్యుడు 28 డిసెంబర్ శనివారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. అంతరాష్ట్ర రహదారి మిట్టదొడ్డి నుండి బలిగేరా మధ్యలో దాదాపు రెండు కిలోమీటర్ వరకు రైతులకు ఇబ్బంది గా మారిన రోడ్డు. రోడ్డు నిర్మాణన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేసిన బిఎస్పీ గద్వాల్ నియోజకవర్గం అధ్యక్షులు బండారి రాజు. జోగులాంబ జిల్లా(గట్టు మండలం) బహుజన్ సమాజ్ పార్టీ గద్వాల్ నియోజకవర్గం అధ్యక్షులు బండారి S రాజు, మాట్లాడుతూ కర్నూల్ నుండి రాయచుర్ కి వెళ్లే అంత రాష్ట్ర రహదారి దాదాపు రెండు కిలో మీటర్ వరకు అలాగే వదిలేయడం వలన, రైతులకు చాలా ఇబ్బంది గా మారింది, గత రెండు సంవత్సరల నుండి ఈ రోడ్డు ని పట్టించుకునే నాధుడు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, రోడ్డు సరిగా లేక ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, నాయకులు ప్రజా ప్రతి నిధులు రోడ్డుపై ప్రయాణం చేస్తున్నారు కానీ చూసి చూడనట్లుగా వ్యవరిస్తున్నారు,ఎన్నో ఏండ్లగా పాలకులు ప్రజల వలన ఓట్లు వేయించుకుంటూ గెలుస్తూ, పట్టించుకోవడం లేదు. రోడ్లు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాలకులు సోయలేదు, వెంటనే ఈ రోడ్లు వేయకపోతే బీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. వెంటనే పాలకులు దిగివచ్చి రోడ్లను పరిశీలించి ప్రజలకు సౌకర్యవంతంగా రోడ్డు ఉండేలా వెయ్యాలని డిమాండ్ చేశారు.