చలో కలెక్టరేట్ కు తరలివెళ్లిన జర్నలిస్టులు

★ అక్రిడేషన్లపై వెలువరించిన జీవో 252 ను రద్దు చేయాలని వినతి

పయనించే సూర్యుడు, డిసెంబర్ 28 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే-ఐజేయు) ఆధ్వర్యంలో నిర్వహించిన చలో రంగా రెడ్డి కలెక్టరేట్ కు శేరిలింగంపల్లి జర్నలి స్టులు శనివారం భారీ ఎత్తున తరలి వెళ్లారు.శనివారం ఉదయం శేరిలింగం పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చందానగర్ పీజేఆర్ స్టేడియంలో సమావేశమైన జర్నలిస్టులు కొంగరకలాన్ లోని రంగారెడ్డి కలెక్టరేట్ కు ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా హాజరైన జర్నలిస్టులతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి, అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న టియుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పైళ్ల విట్టల్ రెడ్డి,రంగారె డ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి,శేరిలింగం పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్ లు మాట్లాడుతూ జర్నలిస్టుల అక్రెడిటేషన్ పాలసీ పేరుతో రాష్ట్ర ప్రభు త్వం తీసుకొచ్చిన జీ ఓ నం.252 లోప భూయిష్టంగా ఉందని వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.రెండు కార్డుల సిద్ధాంతంతో జర్నలిస్టుల నడుమ చిచ్చు పెట్టే ప్రయత్నం మీడియా అకాడ మీలో ఉన్న పెద్దలు చేస్తున్నారని ఈ ప్రయత్నాన్ని తెలంగాణ జర్నలిస్టులు ఎట్టి పరిస్థితుల్లో సహించ మని తేల్చి చెప్పారు.అక్రిడేషన్ల కుదింపుతో తెలం గాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు కనీస గుర్తిం పును కూడా రద్దు చేస్తారా అని ప్రశ్నించా రు.తెలంగాణ జర్నలిస్టుల హక్కులను కాపాడుకోవడానికి మరో పోరాటానికి టీయూడబ్ల్యూజే సిద్ధమన్నారు.లోప భూయిష్టమైన జీవో 252ను తక్షణమే ఉపసంహరించుకొని,కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 239ను కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే మరో పోరాటానికి టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలి స్టులు సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పా రు. ఈ కార్యక్ర మంలో టియుడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా నాయకులు, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్, టెంజు కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.