చెరుకుపల్లి సర్పంచ్ మీసాల రామచంద్రయ్య కు ఎంపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘన సన్మానం

పయనించే సూర్యుడు డిసెంబర్ 28 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నూతన సర్పంచులు ఉపసర్పంచూలు మరియు వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘు వీర్ రెడ్డి, ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ డిండి మండలం చెరకుపల్లి గ్రామ సర్పంచ్ మీసాల రామచంద్రయ్య ను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామాల నూతన పాలకవర్గానికి సూచించారు. నిత్యం గ్రామాల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. గ్రామ అభివృద్ధి చేయడంతో పాటు పల్లెల్లో పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి కాంగ్రెస్ నాయకులు అడపాల వెంకట రమణారెడ్డి, ముత్యాల శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.