జర్నలిస్టుల అక్రమ అరెస్టను ఖండిస్తున్నాం.రాపోలు నవీన్ కుమార్

పయనించే సూర్యుడు డిసెంబర్ 28 నేరేడుచర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్) నేరేడుచర్ల మున్సిపాలిటీలో పత్రికా విలేకరులతో బిఆర్ యస్ నియోజకవర్గ నాయకులు రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు. ఉక్కు పాదంతో అణిచివేస్తున్నారు జర్నలిస్ట్ లకు ధర్నా చేసే హక్కు లేదా, దరఖాస్తు ఇచ్చే హక్కు లేదా ఇదేనా మీరు ఇస్తానన్న ఏడవ గ్యారంటీ. జర్నలిస్టులకు కేసీఆర్ గారు 26,000 అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు. రిపోర్టింగ్ జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులకు అనే తేడా లేకుండా అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే ఇండ్లు ఇస్తాం, ఇంటి స్థలాలను ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అక్రిడేషన్ కార్డులను 10 వేలకు తగ్గించడం దుర్మార్గం. బిఆర్ఎస్ పార్టీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సోషల్ మీడియా, యూట్యూబ్ జర్నలిస్టులను టెర్రరిస్టులుగా పోల్చడం దారుణం. జర్నలిస్టుల పోరాటానికి బిఆర్ఎస్ పూర్తి మద్దతు తెలుపుతుంది అని మాట్లాడారు