జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కు ఘన సత్కారం

★ నియోజకవర్గానికి చెందిన గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.

పయనించే సూర్యుడు డిసెంబర్ : 28 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలోని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వగృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, గోకవరం మండలాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమాన్ని జగ్గంపేట మండలం నుంచి కేశినిడి అప్పారావు, గోవింద్, గోపి, కిర్లంపూడి మండలం నుంచి సత్యవేణి, గండేపల్లి మండలం నుంచి రాజేష్, గోకవరం మండలం నుంచి సత్యనారాయణ, రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 60 గ్రామాల నుంచి వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ అభిమాన నాయకుడికి జిల్లా టిడిపి అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం లభించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ, మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశామని తెలిపారు.