జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలో చైనా మంజా నిషేదం నిబంధనలకు విరుద్ధంగా చైనా మంజా విక్రయించిన,

పయనించే సూర్యుడు తేదీ 28 డిసెంబర్ జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. వినియోగించిన చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలో చైనా మంజా పై నిషేధం విధించడం జరిగిందని, జిల్లా లో ఎవరైనా చైనా మంజా అమ్మిన, దాని వలన ఎవరికైనా ప్రమాదం జరిగిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఒక ప్రకటనతో తెలిపారు. రాబోయే సంక్రాంతి పండగ సంద‌ర్భంగా చైనా మమజా ఎక్కువ‌గా విక్ర‌యించే దుకాణాల పై అధికారులు తనిఖీ లు నిర్వహించడం జరుగుతుందని, ఈ చైనా మంజాలతో పర్యవరణానికి విపత్తుగా మారడం తో పాటు చైనా మాంజ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని , చైనా మంజా విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. చైనా మంజాను ఉప‌యోగించి గాలి ప‌టాలు ఎగుర‌వేసే క్రమంలో ఎన్నో ప‌క్షులు, సాధారణ ప్రజలు కూడా ప్ర‌మాదానికి గురవుతారు. అదే క్ర‌మంలో గాలిప‌టాలు ఎగుర‌వేసే వ్య‌క్తులు కూడ ప్ర‌మాదానికి గురైన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో చైనా మంజా నిషేదించాం అని ఎస్పి తెలిపారు. చైనా మంజా పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం కేసులు నమోదు చేస్తామనింతెలిపారు. జిల్లా పరిధిలో అన్ని ప్రాంతాల్లో చైనా మంజా విక్రయాలు జరగకుండా తగు చర్యలు తీసుకొవడం జరుగుతొందని ప్రధానంగా ప్రజలు సైతం చైనా మంజా వినియోగించకుండా ఎవరికి హాని కలగని సాధారణ దారంతో గాలిపటాలను ఎగురవేసుకోవాలని, అలాగే ఎవరైనా చైనా మంజా విక్రయిస్తున్న, వినియోగిస్తున్న డయల్‌ 100 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలనీ జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.