డిసెంబర్ 31న డీజేలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు

★ వెల్దండ సిఐ విష్ణువర్ధన్ రెడ్డి

పయనించే సూర్యుడు, డిసెంబర్ 28 2025, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల పోలీస్ స్టేషన్ లో డీజే నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. శనివారం వెల్దండ పోలీస్ స్టేషన్ లో వంగూరు, చారగొండ, వెల్దండ, మండలాలలో డీజే నిర్వాహకులతో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా డీజే ఏర్పాట్లకు ఎలాంటి అనుమతులు లేదన్నారు. ఈనెల 31 జనవరి 1 తేదీలలో డీ జే లు ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు భంగం కలిసే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ విష్ణువర్ధన్ రెడ్డి డీజే నిర్వాహకులకు హెచ్చరించారు. ఈ సమావేశంలో చారగొండ ఎస్సై వీరబాబు, వంగూరు ఎస్సై మహేష్ గౌడ్, వెల్దండ ఎస్సై కురుమూర్తి, పోలీసు బృందం ఉన్నారు.