డ్రగ్స్ ని రాష్ట్రం, దేశం నుండి యువత తరిమికొట్టాలి ఎమ్మెల్యే శిరీష

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 28 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో పాయకరావుపేట నుండి ఇచ్ఛాపురం వరకు అభ్యుదయం సైకిల్ యాత్రను యువకులు కొనసాగిస్తూ ఉన్నారు. శనివారం వారు పలాస చేరుకున్న తరుణంలో యువతీ యువకులు వారిని స్వాగతం పలికి పలాస ఇందిరా గాంధీ చౌక్ నుండి రైల్వే గ్రౌండ్ వరకు ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష డి.ఎస్.పి. షేక్ సహబాబ్ అహ్మద్, సి ఐ రామకృష్ణ, ప్రభుత్వ ప్రైవేటు కళాశాల అధ్యాపకులు విద్యార్థులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ సభలో పలాస డి.ఎస్.పి డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినాదాలు చేశారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ డ్రగ్స్ మీద యువత పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ భూతాన్ని తరిమి తరిమి కొట్టాలని యువతకు పిలిపినిచ్చారు. ఈ విషయంలో పోలీస్ శాఖ తమ సాయి శక్తుల పనిచేస్తుందని యువత కూడా వారిని సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ ఫ్రీ డ్రగ్స్ గా రూపొందుతుందన్నారు డ్రగ్స్ వలన ఎందరో యువత చెడు దారిన పడ్డారని, దేశానికి వెన్నుముక కావలసిన యువత, దేశ ప్రగతికి శాపంగా మారితే, మన దేశ రాష్ట్రాన్ని దిశా నిర్దిశ చేయవలసిన వారు లేకుండ పోతారని, దేశం నుండి రాష్ట్రము నుండి డ్రగ్స్ ని తరిమి వేయటానికి యువత నడుం బిగించాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి లోకేష్ డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ చేయాలన్న సంకల్పంతో ఉన్నారని ఆమె అన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వజ్జా బాబురావు పిరుకట్ల విటల్ మల్ల శ్రీనివాస రావు, కూటమి నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *