తంగళ్ళపల్లి స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన పాలకవర్గ ఎన్నికలు విజయవంతం

పయనించే సూర్యుడు, డిసెంబర్ 28 ( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) చెరుకుపల్లి రాకేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన పాలకవర్గ కమిటీకి ఈరోజు రెండు సంవత్సరాల కాలపరిమితితో ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా బండి చైతన్య, ఉపాధ్యక్షులుగా ఎగుమామిడి వెంకట రమణారెడ్డి, కోడం రమేష్, బత్తిని మల్లేశం, సామల గణేష్, సామల రమేష్ లు ఎన్నికయ్యారు.ప్రధాన కార్యదర్శిగా రాపెళ్లి ఆనందం, కోశాధికారులుగా సుద్దాల కరుణాకర్, ఆసాని లక్ష్మారెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా మచ్చ విజయ్, క్యారం జగత్, సాంస్కృతిక కార్యదర్శులుగా పడిగల రాజు, జూకంటి శివశంకర్, ప్రచార కార్యదర్శులుగా చెన్నమనేని ప్రశాంత్, ఎడమల శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా ఎడమల బాల్ రెడ్డి, రంగు అంజయ్య, కొండన్నపేట ఆంజనేయులు, జిందం సంతోష్, దొందడి రమేష్, విశ్వనాథుల రమేష్, పరికిపండ్ల రమేష్ ఎన్నికయ్యారు. ఎన్నికైన పాలకవర్గ సభ్యులను గ్రామ సర్పంచ్ మోర లక్ష్మి రాజం, ఉప సర్పంచ్ ఆసాని శ్రీకాంత్ రెడ్డి, ఎన్నికల అధికారి ఎడమల హనుమంత రెడ్డి సన్మానించి అభినందించారు.