పయనించే సూర్యుడు డిసెంబర్ 28 సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల్ నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని వక్ఫ్ బోర్డు భూమి మరియు పలు సమస్యల పై జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్ మరియు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సహకారంతో ఈరోజు మున్సిపల్ పట్టణ మైనారిటీ నాయకులు తెలంగాణ రాష్ట్ర టిజిడబ్లు ఛైర్మెన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ ని కలిసి పట్టణం లోని వక్ఫ్ భూమి లో గల షాదిఖానా కొరకు 50 లక్షలు, మరియు షాదిఖానా చుట్టూ కాంపౌండ్ వాల్ కొరకు 50 లక్షలు మరియు ఈద్గా కొరకు 5 ఎకరాలు మరియు కబ్రస్తాన్ కొరకు 5 ఎకరాల భూమిని మంజూరు చేయాలని అలాగే ముస్లింల యొక్క పలు సమస్యల పై నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పట్టణ మైనారిటీ నాయకులను హైద్రాబాద్ లోని టీజీ డబ్ల్యూచైర్మన్ కార్యాలయం లో వారిని కలిసి ఇట్టి సమస్యల పట్ల వివరించి దానికి చైర్మన్ కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా ఇట్టి సమస్యలను పరిష్కారించడమే కాకుండా త్వరలోనే ఇట్టి కార్యక్రమలను ప్రారంభిద్దాం అని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వారితోపాటు తాహెర్ అలీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, శంకర్ సెట్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, సంగన్న న్యాయవాది, పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ, మొయినొద్దిన్, మే మజీద్ మాజీ కౌన్సిలర్,సుబుర్, అబిబ్ అబ్దుల్లా,హైదర్ నవాబ్, గౌస్ చిస్థి, ముకిత్, శాదుల్లా చిస్తి, హఫీజ్ మదీనా, షఫీ ఖురేషి, మెయిన్ ఖురేషి, శకిబ్, అజీమ్, సల్మాన్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు