
పయనించే సూర్యుడు, డిసెంబర్ 28, దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్, వల్లపు నరేష్ నల్గొండ జిల్లా. దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నూతన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు మరియు వార్డు సభ్యుల ఆత్మీయ సన్మానకార్యక్రమంలో నల్గొండ ఎంపీ కుందురు రఘువీర్ రెడ్డి తో కలిసి పాల్గొని,నూతన సర్పంచులను,శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామాల నూతన పాలకవర్గాలకు సూచించారు. నిత్యం గ్రామాల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. ప్రజలు ఇచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవాలన్నారు. గ్రామాభివృద్ధి చేయడంతో పాటు పల్లెల్లో పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సంతోషమే లక్ష్యంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని, త్వరలో మిగిలిన హామీల్ని కూడా అమలు చేస్తామన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో జరిగిన మూడోవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్నినిలబెట్టుకుందని తెలిపారు. 180చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందగా, 50స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళలు, నూతన సర్పంచులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.