ధర్మవరం ఆదర్శ విద్యాలయం లో తల్లిదండ్రుల సమావేశం కార్యక్రమం

పయనించే సూర్యుడు ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్,డిసెంబర్, 28:- ప్రతిపాడు మండలం ధర్మవరం ఆదర్శ విద్యాలయం యజమాన్యం తల్లిదండ్రులు సమావేశం నిర్వహించారు విద్యార్థినులు నృత్యాలతో తల్లిదండ్రులకు స్వాగతం పలికారు ఆదర్శ విద్యాలయం ఉపాధ్యాయులు చక్కటి పాటలతో ఉత్తేజపరిచారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దాడి రమణ తల్లిదండ్రులు ఉద్దేశించి మాట్లాడారు 34 సంవత్సరాల నుండి ఆదర్శ విద్యాలయం కొనసాగిస్తూ అనేకమంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే లక్యంగా పనిచేస్తున్నామని తల్లిదండ్రులకు వివరించారు ఈ సంవత్సరం లక్ష్మీ నవోదయ కోచింగ్ సెంటర్ ఆరు మంది విద్యార్థులు ఘనవిజయం సాధించిన ఘనత ఆదర్శ విద్యాలయం అని అన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరుగా ఆదర్శ విద్యాలయం విద్యా బోధన విద్యా బోధన చేస్తున్నారు అంటూ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు విద్య మరియు క్రీడా రంగాలలో కూడా అద్భుతంగా ఆదర్శ విద్యాలయం యాజమాన్యం వారు తీర్చిదిద్దుతున్నారని అన్నారు ఈ సందర్భంగా తల్లిదండ్రులకు క్విజ్ పోటీలు నిర్వహించి ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆదర్శ విద్యాలయం కరెస్పాండెంట్ దాడి చిన్నారావు ప్రిన్సిపల్ దాడి రమణ హెడ్మాస్టర్ దాడి రాంబాబు పత్రి రమణ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు