నేషన్ ఫస్ట్ సిద్ధాంతం తో పనిచేస్తున్న అతి పెద్ద విద్యార్థి సంఘము ఏబీవీపీ

★ రామకృష్ణ ఏబీవీపీ కరీంనగర్ విభాగ్ సంఘటన కార్యదర్శి.

పయనించే సూర్యుడు, డిసెంబర్ 28 రాజన్న సిరిసిల్ల జిల్లా ( స్టాఫ్ రిపోర్టర్ ఎమ్.ఎ. షకీల్) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సిరిసిల్ల శాఖ అధ్వర్యంలో ఈ రోజు స్థానిక సాయి శ్రీ కళాశాలలో 44వ రాష్ట్ర మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతర ఉద్యమాలతో విద్యార్థుల సమస్యలపై గళమెత్తుతున్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని అన్నారు.జనవరి 3,4,5 తేదీలలో శంషాబాద్ లో రాష్ట్ర మహాసభలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ మహాసభల్లో దాదాపు 800మంది విద్యార్థి నాయకులు, ప్రొఫెసర్లు, ప్రముఖులు, రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థి నాయకులు హాజరవుతారని తెలిపారు. విద్యారంగ సమస్యలపైన, విద్యారంగస్థితి, రాష్ట్ర సమస్యలు, పర్యావరణ పరిరక్షణ, డ్రగ్స్ మహమ్మారి నిర్మూలన తదితర అంశాలపై తీర్మాణాలు చేయనున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని విద్యార్థి నాయకులు మహాసభలకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పెళ్లి రాజు రావు, జిల్లా హాస్టల్స్ కన్వీనర్ పూజం కార్తీక్, నగర కార్యదర్శి ధనుష్ ,నాయకులు సాయి తేజ, ప్రవీణ్, చైతన్య తదితర నాయకులు పాల్గొన్నారు.