పేద ప్రజలకు అండ సిపిఐ జెండా

పయనించే సూర్యుడు డిసెంబర్ 28 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 101 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదోని మండలం 104 బస్సాపురం గ్రామం నందు సిపిఐ పతాకాన్ని సిపిఐ గ్రామ కార్యదర్శి కరెంటు ఈరన్న గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్, ఆదోని సిపిఐమండల కార్యదర్శి కల్లుబావిరాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి బసాపురం గోపాల్, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు వైటి భీమేష్, వెంకన్న తదితరులు ముఖ్య నాయకులుగా పాల్గొని మాట్లాడుతూ..పేద మధ్య తరగతి కుటుంబాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజా సమస్యలపై సిపిఐ పార్టీ నిరంతరం పోరాడుతుందని కూటము ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకపోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి గ్రామములో మూడు సెంట్లు ఇంటి స్థలము ఇచ్చి, ఇల్లు నిర్మించుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికీ కూడా సొంతింటి కల నెరవేర్చలేకపోవడం దారుణం అన్నారు. గ్రామాలలో వలసలను నివారించేందుకు వామపక్ష పార్టీలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పేదలు నిర్వహించిన పోరాటాల ఫలితంగా 2005 అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. 2006లో అమలు చేసిందని అప్పటినుంచి ఇప్పటివరకు నామమాత్రపు నిధులతో గ్రామీణ పేద ప్రజలకు ఎంతోకొంత ఆకలి తీర్చే విధంగా ఉపయోగపడుతున్న ఈ పథకాన్ని నిర్విరం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. ఈ పథకం పేరు మార్చి కొత్త చట్టం తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని అందుకు సంబంధించిన బిల్లు పత్రాలను లోకసభలో ఆమోదించడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ కూటమి ప్రభుత్వం విద్య వైద్యం పట్ల పూర్తిగా నిర్విరం చేస్తుందని ప్రభుత్వ వైద్య కళాశాలలను పి,పి,పి పద్ధతిలో ప్రైవేటీకరించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రజా ఆరోగ్యం వ్యాపారం కాదని ప్రజల హక్కుని తెలిపారు వైద్య కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గుడిసె ఈరన్న నరసప్ప అలవాటు రాముడు నరసింహులు ఖాదర్ లింగ కిట్టయ్య చరణ్ వీరాంజనేయ పశువులు గర్జప్ప పశువులు అనుమంతుపార్టీ సభ్యులు పార్టీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.