బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం.

పయనించే సూర్యుడు 28-12-2025 జబ్బార్ కామారెడ్డి కాంసెన్సీ ఇన్చార్జి. బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన అల్వాల శ్రీనివాస్ శనివారం రోజున మరణించగా రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సంజీవరెడ్డికి రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్న నాగరాజ్ గౌడ్ కుటుంబపరిస్థితి తెల్పగా 5,000 రూపాయలు నగదు ఆర్థిక సహాయం పంపించారని అట్టి నగదును కుటుంబ సభ్యులకు అందించామన్నారు ఈ కార్యక్రమంలో గజెల్లి నర్సింలు, రంగు శ్రీనివాస్,సహదేవ్, దేవదాస్,మహిపాల్ రెడ్డి, బాల్ చంద్,రాజిరెడ్డి స్వామి, చంద్రం, మాధవ్ తదితరులు పాల్గొన్నారు