బిజెపి తరఫున గెలిచిన వార్డు నెంబర్లకు ఘనంగా సన్మానం .

పయనించే సూర్యుడు డిసెంబర్ 28, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). ఈరోజు చింతకాని మండలం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు కొండా గోపి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లలో చింతకాని మండలంలో వార్డు నెంబర్లు గా గెలిచినటువంటి కోమట్ల గూడెం 9వ వార్డు పల్లపు పెద్దిరాజు కి మరియు లచ్చగూడెం గ్రామంలో 7వ వార్డుగా గెలిచిన చింతాల కృష్ణ కి మండల బిజెపి పార్టీ ఆఫీసులో ఘనంగా సన్మానం చేసి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరు నాగేశ్వరరావు హాజరయ్యారు. ఏలూరి నాగేశ్వరరావు కి కూడా మల్లారం గ్రామం ఉపసర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా చింతకాని బిజెపి మండల పార్టీ తరఫున సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సత్యనారాయణ, జిల్లా కౌన్సిలర్ సభ్యులు ఆవులూరి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు బక్క సత్యమూర్తి, సీనియర్ నాయకులు కొరిపెల్లి శ్రీను, చెన్నూరి నాగాచారి,బూత్ అధ్యక్షులు ముత్త అంజన సిద్ధార్థ,వేముల ఎల్లయ్య, పామర్తి శ్రీను, రాయల వెంకటేశ్వర్లు, దొడ్డ రామకృష్ణ, దొడ్డ శ్రీనివాస్, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.