
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 28 బోధన్:ఏడపల్లి మండల కేంద్రంలో బోధన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కారక్రమానికి అధ్యక్షత వహించిన బోధన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్తీక్ యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ నాయకుడి బాధ్యత అని అన్నారు.యూత్ కాంగ్రెస్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేద్దాం అని అన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఎదగడానికి మంచి వేదిక అని దానిని సద్వినియోగం చేసుకోవాలి అని హితవు పలికారు.అనంతరం సర్పంచులుగా ఎన్నికైన కార్తీక్ యాదవ్ ,రాజు గౌడ్ లను సన్మానించి జిల్లా ప్రధాన కార్యదర్శి సంజయ్, ఈ కార్యక్రమంలో జైతాపూర్ సర్పంచ్,జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్,సంజయ్ బోధన్ నియోజకవర్గ ఉప అధ్యక్షులు నవీన్,జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ అబ్బోల్ల శ్రీకాంత్, ఏడపల్లి,రెంజల్, నవీపేట్ మండలాల అధ్యక్షులు రంజిత్ ఔదారీ, గైని కిరణ్,ప్రవీణ్, బోధన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ గోనేవర్ లక్ష్మణ్,కుమార్,శివ తదితరులు పాల్గొన్నారు.