మాడ్రన్ కబడ్డీలో దూసుకుపోతున్న కరీంనగర్ జిల్లా జట్టు

★ రాష్ట్ర స్తాయి పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన. ★ జట్టుకు ఉత్తేజాన్నిస్తున్న జిల్లా అధ్యక్షుడు సంపత్ రావు.

పయనించే సూర్యుడు డిసెంబర్ 28 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న మోడ్రన్ కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీల్లో రెండవ రోజు లీగ్ దశలో కరీంనగర్ జిల్లా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ప్రత్యర్థులను చిత్తు చేసింది.మొదటిమ్యాచ్ లో సంగారెడ్డి జిల్లా జట్టు 22 పాయింట్లు సాధించగా కరీంనగర్ జిల్లా జట్టు 70 పాయింట్ల తో ఘన విజయం సాధించింది. రెండవ మ్యాచ్ లో వరంగల్ జిల్లా జట్టు 26 పాయింట్లు సాధించగా కరీంనగర్ జిల్లా జట్టు 47 పాయింట్ల తో విజయం సాధించారు.కరీంనగర్ జిల్లా జట్టును అధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు దగ్గరుండి ఉత్తేజ పరిచాడు.అనంతరం సంపత్ రావు మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ ల్లో జిల్లా జట్టు సభ్యులు కలిసికట్టుగా ఆడి అద్భుత విజయాలు సాధించారని కొనియాడారు.రాబోయే మ్యాచ్ లల్లో కూడా ఇదే రకమైన ప్రతిభను కనబరుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అద్భుత ప్రతిభ కనబరిచిన కరీంనగర్ జిల్లా జట్టు క్రీడాకారులను మోడ్రన్ కబడ్డీ ఫౌండర్ కోటం రాంరెడ్డి,జిల్లా అధ్యక్షుడు సంపత్ రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో మోడ్రన్ కబడ్డీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు తో పాటు కార్యదర్శి మావునూరి అంజయ్య, ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, మాడ గౌతంరెడ్డి ఉన్నారు.