
పయనించే సూర్యుడు డిసెంబర్ 28 కరీంనగర్ న్యూస్: ముంజంపల్లి గ్రామ ప్రజలు అందరూ భారీ మెజార్టీతో గెలిపించినందున గ్రామ ప్రజలకు నమస్కారాలు ముంజంపల్లి గ్రామ సర్పంచ్ నందగిరి కనకలక్ష్మి – రవీంద్రా చారి మాట్లాడుతూ మానకొండూర్ మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు సచ్చు భారత్ కార్యక్రమంలో ముంజంపల్లి గ్రామాన్ని మండలంలోని మొదటి స్థానంలో ఉండడానికి కృషి చేస్తామని అన్నారు గ్రామ ప్రజలు పాలక వర్గం తో ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా చేసినాము గ్రామ సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజల సహకారం తో ముంజంపల్లి గ్రామమును జిల్లాలోని మోడల్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు రైతులకు ఐకెపి సెంటర్ మరియు అక్కాచెల్లెళ్లకు దసరా పండుగ వరకు బతుకమ్మ షూట్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు అర్హులకు రేషన్ కార్డులు ఇప్పిస్తామని అన్నారు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని అన్నారు గ్రామంలో విధి దీపాలను ఎప్పటికప్పుడు పెట్టిస్తామని అన్నారు గ్రామంలో నూతన సిసి రోడ్లు డ్రైనేజీలు గ్రామం పరిశుద్ధం తో పాటు శుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు
గ్రామ ప్రజలతో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రజలందరికీ గ్రామంలో అందుబాటులో ఉంటాను ఏ కష్టం వచ్చినా మీ ఇంటి పెద్ద బిడ్డలగా అక్క అంటే మీ వెంటే ఉంటూ ప్రజల కష్టాలను మా కష్టాలుగా ముందుంటామని అన్నారు మేము ఇచ్చిన హామీలను ప్రజలతో మమేకమై వాటిని అధికారుల దృష్టికి తీసుకుపోయి సాంక్షన్ చేయించుకొని మాకు ఉన్న సమయంలో వాటిని పూర్తి చేస్తామని అన్నారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నిస్వార్థపరులు అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉంటామని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ బత్తిని కుమార్ గౌడ్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు నరసింహారెడ్డి పాశం కనుకయ్య శ్రీనివాస్ గౌడ్ కుమార్ మల్లయ్య శివశంకర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు