మున్సిపల్ ఎన్నికలే లక్ష్యం కరీంనగర్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాచరణ

పయనించే సూర్యుడు డిసెంబర్ 28 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ నగర వ్యాప్తంగా 66 డివిజన్లను 6 జోన్లుగా విభజన జిల్లా అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ పటిష్టతకు పనిచేయాలని అన్నారు శనివారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నగరానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్య అంశాలు జోన్ల విభజన: కరీంనగర్ పట్టణంలోని 66 డివిజన్లను 6 జోన్లుగా విభజించారు ప్రతి జోన్ పరిధిలోకి 11 డివిజన్లు వస్తాయి నూతన నియామకాలు ప్రతి జోన్‌కు ముగ్గురు సభ్యులను నియమించనున్నారు. ఇందులో ఒకరు జనరల్ సెక్రటరీగా ఇద్దరు సెక్రటరీలుగా బాధ్యతలు నిర్వహిస్తారు కార్యకర్తలకు గుర్తింపు పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే నిజాయితీ గల కార్యకర్తలకు పదవుల్లో పెద్దపీట వేస్తామని నాయకత్వం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రతినిధులు నమ్మిండ్ల శ్రీనివాస్, రుద్ర సంతోష్, గౌస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆరేపల్లి మోహన్, ఒడితల ప్రణవ్ ,నగర కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, పడాల రాహుల్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఎండి తాజ్, మడుపు మోహన్, కొరివి అరుణ్ కుమార్, శ్రావణ్ నాయక్, సిరాజ్ హుస్సేన్, ఎస్ ఏ మోసిన్, అబ్దుల్ రహమాన్, చర్ల పద్మ, వెన్నం రజిత రెడ్డి, అహ్మద్ అలీ, కుర్ర పోచయ్య, లతోపాటు పలువురు నగర కాంగ్రెస్ నాయకులు 66 డివిజన్ల అధ్యక్షులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు