పయనించే సూర్యుడు, డిసెంబర్ 28 2025, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రానికి చెందిన ముక్తాల జంగయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది. శనివారం విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య మృతుని కుటుంబాన్ని పరామర్శించి మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని కల్పించారు. జంగయ్య కుటుంబ సభ్యులకు 5000/ రూపాయల ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ జంగిలి నిరంజన్, మాజీ ఎంపిటిసి చలిచీమల జ్యోతి నిరంజన్, బిజెపి కల్వకుర్తి తాలూక ఇంచార్జి యన్నం శేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ 12 వ వార్డు మెంబర్ సిర్సనగండ్ల శేఖర్, 4 వ వార్డు మెంబర్ జంగిలి సునీత ఆనంద్, యువకులు సైదులు, భాస్కర్, కోట్ల శేఖర్, ఉడుత శేఖర్, అనిల్, రాజు, మదిరం మల్లేష్, పిల్లి శ్రీను, తుంగ శ్రీను, కుర్మిద్దె యాదగిరి, చిన్న పెద్దయ్య బిఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.