మ్యాగ్నెట్ స్కూల్లో ఘనంగా ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్

* వివిధ ప్రాంతాల వంటకాలను రెడీ చేసిన విద్యార్థులు * ముఖ్యఅతిథిగా పాల్గొన్న కరస్పాండెంట్ వాజిద్ పాష

పయనించే సూర్యుడు డిసెంబర్ 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ షాద్నగర్ పట్టణంలోని శ్రీ నారాయణ మ్యాగ్నెట్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ ని అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులు వివిధ దేశాలకు సంబంధించిన మరియు రాష్ట్రాలకు సంబంధించిన వంటకాలను రెడీ చేయడం జరిగింది .ఇందులో చాలామంది తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొని ఈ ప్రోగ్రాం గురించి చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదే విధంగా పాఠశాల కరస్పాండెంట్ ఎండి వాజిద్ భాషా పాల్గొని విద్యార్థుల యొక్క కృషిని మరియు వాళ్లు చేసిన వివిధ పంటకాలను రుచి చూసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తల్లి ఇంట్లో తను పడే కష్టం మరియు వాళ్లకోసం ఎంత సమయం వెచ్చిస్తున్నారు వంట రూమ్ లో అని తెలియ చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి దానితోపాటు ఒక వంటలు తయారు చేయడం మరియు దానికి సంబంధించి ఎలాంటి వ దినుసులను అంటే ఇంగ్రిడియంట్స్ ఏవేవి వాడతారో వటి యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియ చెప్పడానికి ఈ కార్యక్రమానికి నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరిగింది. అందులో మొదటి స్థానాలను మరియు రెండవ స్థానాలను సాధించిన వివిధ విద్యార్థులకు ప్రశంస పత్రాలను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరికులం డైరెక్టర్ వినోద్ కుమార్ ,ప్రిన్సిపాల్ ఆనంద్ కుమార్ ,వైస్ ప్రిన్సిపల్ ఆసిఫ్ మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *