రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమంటున్న విద్యుత్ మీటర్స రీడర్స్ కార్మిక సంఘం

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 28 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. విద్యుత్ సంస్థని నమ్ముకొని దాదాపుగా 15 నుండి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న విద్యుత్ మీటర్స్ రీడర్స్ కు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న తరుణంలో ఉపాధి కోల్పోతున్న మీటర్ రీడర్లకు న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు బైపల్లి ఓంకార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమ్ భూషణ్ రెడ్డి పలాస డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏపీ విద్యుత్ మీటర్ రీడర్ల సమావేశంను శనివారం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విద్యుత్ మీటర్ రీడర్స్కు జరిగిన అన్యాయంపై ప్రతిపక్షంలో ఉన్న లోకేష్ పాదయాత్ర సందర్భంగా విద్యుత్ మీటర్స్ కు అనేక హామీలు ఇవ్వడం జరిగిందని ప్రధానంగా స్మార్ట్ మీటర్లు బిగించబోమని మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి, అధికారంలోకి రావడం జరిగిందని, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్పాట్ మీటర్లు ను బిగుస్తూ మీటర్ రీడర్స్ కార్మికుల పొట్టను కొడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే మీటర్ రీడర్స్కు ఉపాధి పోయి రోడ్డున పడకుండా విద్యుత్ సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఎస్క్రో అకౌంట్ ద్వారా ప్రతినెల వేతనాలు చెల్లించాలని ఎన్నిసార్లు యాజమాన్యం దృష్టికి మరియు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం అవ్వకపోవడంతో 22/12/2025న మీటర్ రీడర్స్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీటర్ రీడర్స్ సమస్యలను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కే. విజయానంద్ దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి ఎన్నోసార్లు తీసుకువెళ్లిన తమ సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని, అందుకోసం మీటర్ రీడర్స్ రాష్ట్ర కమిటీ కార్యచరణ ప్రకటించడం జరిగింది మీటర్ రీడర్స్ ఐటిఐ ఉన్న వారిని షిఫ్ట్ ఆపరేటర్ గాను,వాచ్ అండ్ వార్డ్ గా ఎం ఆర్ టి లో స్కిల్డ్ అండ్ ఆన్ స్కిల్డ్ వర్కర్ గా అర్హతను బట్టి కంప్యూటర్ ఆపరేటర్ గా అటెండర్ గాను వాచ్మెన్ గాను డ్రైవర్ గాను బ్రేక్డౌన్ గ్యాంగ్ గాను, 3 ప్లస్ వన్ ముగ్గురు ఐటిఐ ప్లస్ అన్ స్కిల్ వర్కర్స్ నియమించడం వలన ట్రీ కటింగ్ మెయింటెనెన్స్ మరియు 12 రోజులు రీడింగ్ అనంతరం మీటర్ రీడర్ ను డీ లిస్ట్ ఆపరేట్ చేయడం, మీటర్లు మార్చడం మొదలగు పనులకు ఉపయోగించుకోవాలని వారు తెలిపారు.ఈ సమావేశానికి హాజరైన మీటర్ రీడర్స్ సభ్యులు ఎస్. చందు, తేజ, అఖిల్ పలాస డివిజన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు.