పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ డిసెంబర్ 28.12.2025 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రి సర్వే ను అధికారులకు రైతులు సహకరించాలని తెలుగుదేశం పార్టీ యువ నేత మాదిరాజు ప్రదీప్ రాజు అన్నారు శనివారం మండలంలోని పందిళ్ళపల్లి పంచాయతీ బాలసముద్రంలో రి సర్వే పై గ్రామసభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఇప్పటివరకు గ్రామాలకు సంబంధించిన బౌండరీల రీ సర్వే జరిగిందన్నారు వచ్చే జనవరి 2 నుంచి రైతుల భూములకు సంబంధించిన సర్వే ఉంటుందన్నారు రైతులు తమ రికార్డులను తీసుకొని భూముల రీసర్వే కి వచ్చే అధికారులకు సహకరించాలని కోరారు అనంతరం ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు
