వర్కింగ్ జర్నలిస్టులకు నష్టం చేకూర్చే జీవో 252ను వెంటనే సవరించాలి

* అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందించాలి * జర్నలిస్టుల సంక్షేమపై ప్రభుత్వ కాలయాపనను సహించబోము * TUWJ జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా * రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట 100 మంది జర్నలిస్టులతో భారీ నిరసన

పయనించే సూర్యుడు డిసెంబర్ 28 రాజన్న సిరిసిల్ల జిల్లా ( స్టాఫ్ రిపోర్టర్ ఎమ్ ఎ షకీల్) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 252 జర్నలిస్టుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H 143) జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు. జీవోను నిరసిస్తూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద చలో కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా TUWJ జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా మాట్లాడుతూ, ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మెజారిటీ జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డులు పొందే అవకాశాన్ని కోల్పోతారన్నారు. జీవోను రూపొందించిన విధానం జర్నలిస్టుల హక్కులను, సంక్షేమాన్ని కాలరాయడమేనని లాయక్ పాషా మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో జర్నలిస్టులు తమ ప్రాణాలను, ఉద్యోగాలను పణంగా పెట్టి పోరాడారని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమికను పోషించిన జర్నలిస్టు సమాజంపై నేడు ప్రభుత్వం కక్ష గట్టడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు. ప్రజా పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి జర్నలిస్టుల సంక్షేమం దృష్ట్యా ఈ జీవోను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటినప్పటికీ జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వ కాలయాపన విధానం సరైంది కాదన్నారు. 252 జీవోను సవరించాలి. జర్నలిస్టుల సంక్షేమం కోసం సత్వర చర్యలు తీసుకోని ఎడల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ ల నేతృత్వంలో భారీ ఆందోళన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ అధికారికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే హెచ్ 143 ప్రధాన కార్యదర్శి సామల గట్టు, ఎలక్ట్రానిక్ మీడియా టెన్జూ అధ్యక్షులు ఇరుకుల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్, గౌరవ సలహాదారులు రాపల్లి సంతోష్ లతోపాటు వివిధ మండలాల ప్రెస్ క్లబ్ ల అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా కార్యవర్గం, యూనియన్ నాయకులు, సుమారు 100కు పైగా జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *