విద్యా బోధన వ్యాపారంగా మారకూడదు:తల్లాడ సర్పంచ్ చిన్నబ్బాయి

పయనించే సూర్యుడు న్యూస్ : డిసెంబర్ 28, తల్లాడ రిపోర్టర్ విద్యను వ్యాపారం గా మార్చకుండా నేటి బాలుర్ రేపటి భారత పౌరలు అనే ఆశయంతో విద్యాభోధన్ నిర్వహిచాల్సిన అవసరం ఎంతో ఉందని తల్లాడ మేజర్ పంచాయతీ సర్పంచ్ పెరిక నాగేశ్వరావు (చిన్నబ్బాయి) అన్నారు. శనివారం స్థానిక యూనివర్సల్ విద్యాలయంలో అత్యధిక మార్కులు సాధిచిన విద్యార్థులకు బహుమతి ప్రధాన కార్యక్రమంలో ముఘ్య్ అధితి గా పాల్గొని ఆయను మాట్లాడుతూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు 50% ఫీ తిరిగి ఇవ్వటం చాలా మంచి కార్యక్రమం అని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వమే విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వ లేకపోతున్న ఈ తరుణంలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు 50 శాతం ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వటం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ కె జి నుండి 10వ తరగతి వరకు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సర్పంచ్ ఉప సర్పంచ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్ష్మారెడ్డి, తల్లాడ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీర మోహన్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు జివిఆర్ పాఠశాల కరస్పాండెంట్ డీకే ప్రసన్నన్, డైరెక్టర్ మేరీ సోఫియా, ఉపాధ్యాయులు మోహన్,యాకూబ్,మనిషా, అరుణ,రోహిణి,కృష్ణవేణి,సిరి, సమత, రాము, రవి, రమేష్ తదితరులు ఉన్నారు సర్పంచ్ ఉప సర్పంచ్ లకు ఘన సన్మానం తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు ఉపసర్పంచ్ లక్ష్మ రెడ్డి లను స్థానిక యూనివర్సల్ విద్యాలయం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు శనివారం శాలువులతో ఘనంగా సన్మానించారు. యూనివర్సల్ విద్యాలయంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించేందుకు ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ ఉప సర్పంచ్ లను పాఠశాల యాజమాన్యం సల్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచ్లు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని రాజకీయాలకి అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు అందరితో కలిసి పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ టి కే ప్రసన్నన్, డైరెక్టర్ మేరీ సోఫియా,రెడ్డీం వీర మోహన్ రెడ్డి,జివిఆర్ పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *