షిరిడి సాయిబాబా భక్తులకు అన్నదానం చేసిన

★ మాజీ సర్పంచ్ పొట్టేటి సంధ్యారాణి బ్రహ్మారెడ్డి ★ భక్తులకు అన్నదానం వడ్డిస్తున్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొట్టేటి జనార్దన్ రెడ్డి దంపతులు

పయనించే సూర్యుడు న్యూస్ : డిసెంబర్ 28, తల్లాడ రిపోర్టర్ తల్లాడ గ్రామపంచాయతీ పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పొట్టేటి సంధ్యారాణి, బ్రహ్మారెడ్డి దంపతులు , సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొట్టేటి జనార్దన్ రెడ్డి దంపతులు వారు షిరిడి సాయిబాబా భక్తులకు శనివారం అన్నదానం చేశారు, శివాజీ షిరిడి సాయిబాబా సేవాశ్రమము సాయి వరలక్ష్మీ 100 అడుగుల ఎత్తుగల సాయి కోటి మహోత్సవము లక్ష్మీపురం గార్డెన్స్ పెదవేగి మండలం ఏలూరు జిల్లా నుంచి షిరిడి వరకు 45 రోజులు ఒక వెయ్యి 50 కిలోమీటర్ల షిరిడి సాయి పాదయాత్ర శనివారం తల్లాడ చేరింది పొట్టేటి జనార్దన్ రెడ్డి కుటుంబం వారికి స్వాగతం పలికారు, నారాయణపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సంధ్యారాణి, బ్రహ్మారెడ్డి దంపతులు వారికి అన్నదానం చేశారు, సాయి భక్తులు మాట్లాడుతూ శనివారం రాత్రి అయ్యప్ప స్వామి వైరా టెంపుల్ లో బస చేస్తామన్నారు.