సభను విజయవంతం చేయండి

★ స్మారకోపన్యాస సభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ ★ ఆవిష్కరించిన మానవ హక్కుల జిల్లా ప్రతినిధులు

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 28 మానవ హక్కుల ఉద్యమ నేత, సీనియర్ న్యాయవాది, అభ్యుదయ వాది గొర్రెపాటి మాధవరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగర కేంద్రం ఎల్లమ్మ గుట్ట లో మాధవరావు ఇంటి వద్ద ఈ నెల 28 ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగే స్మారకోపన్యాస సభ వాల్ పోస్టర్ల ను శనివారం నిజామాబాద్ లోని తెలంగాణ ఆల్ పెన్షనర్స్,అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆఫీస్ ఆవరణలో అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు,మానవ హక్కుల వేదిక జిల్లా ప్రతినిధులు కలసి ఆవిష్కరించారు. స్మారకోపన్యాస సభకు ముఖ్య అథితిగా నల్సార్ న్యాయ శాస్త్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీ కృష్ణదేవరావు, మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్.జీవన్ కుమార్ హాజరువుతున్నారని ప్రతినిధులు తెలిపారు..పెన్షనర్స్ యూనియన్ నాయకులు రామ్మోహన్రావు, సిర్ప హనుమాన్లు, ఈవిల్ నారాయణ, లావు వీరయ్య, సిర్ఫా లింగయ్య, రాధా కిషన్, ప్రసాదరావు, ప్రేమలత, దీన సుజన, పుష్పవల్లి, అమీరుద్దీన్, గడ్డం గంగుల్,బాల దుర్గయ్య, సాగర్, తదితరులు పాల్గొన్నారు.