పయనించే సూర్యుడు న్యూస్:డిసెంబర్ 28 అనంతసాగరం మండలం,నెల్లూరు జిల్లా(రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) మండల కేంద్రమైన అనంతసాగరంలో నియోజకవర్గస్థాయిలో జాలి బాయ్స్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ టోర్నమెంట్ కి బహుమతి ప్రోత్సాహం అందిస్తున్న మందారామకృష్ణ, వడ్లపల్లి శ్రీను,చింతమల్లు విష్ణు, సూరిపోగు శ్రీనివాసులు, పల్లవోలు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రథమ బహుమతిగా 25000, ద్వితీయ బహుమతిగా 15000, అలాగే ఎంట్రీ ఫీజు 999 రూపాయలు ఉంటుందని, జనవరి 10న టోర్నమెంట్ ప్రారంభం అవుతుందని తెలిపారు. టోర్నమెంట్ లో పాల్గొనదలచిన వారు 9951215937, 9347 337500, 9963636983, 9989506398 నెంబర్లకు సంప్రదించవలసిందిగా తెలిపారు