ఆలయల ముఖ ద్వారాల నిర్మాణానికి చలసాని రాజీవ్ విరాళం

పయనించే సూర్యుడు నేరేడుచర్ల డిసెంబర్ 29 నేరేడుచర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్ ) నేరేడుచర్ల లోని శ్రీ కోదండ రామాలయం, శ్రీ విజయ దుర్గ ఆలయాల ముఖద్వారాల నిర్మాణానికి ఆడ్రాయిట్ సొల్యూషన్స్ అధినేత చలసాని రాజీవ్ శనివారం 6 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు, ఈ కార్యక్రమంలో శ్రీ విజయ దుర్గ ఆలయ కమిటీ చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగండ్ల శ్రీధర్, శ్రీ కోదండ రామాలయం చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, ఆలయ ధర్మకర్త రాచకొండ నాగ మాధవరావు, ఏపీడబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ సభ్యుడు చలసాని శ్రీనివాసరావు, నూకల సందీప్ రెడ్డి, తాళ్ల సురేష్ రెడ్డి, పొనుగోటి జంగారావు, కొదమగుండ్ల నగేష్, కుంకు తిరుపతయ్య, కే సూరిబాబు, ఇనపాల పిచ్చిరెడ్డి, ఉప్పల కృపాకర్, వినోద్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు