ఒకేషనల్ జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి

★ ఏఐఎస్ఎఫ్ డిమాండ్

పయనించే సూర్యుడు డిసెంబర్ 29 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి అప్రెంషిప్ పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్న ఒకేషనల్ కళాశాల యజమాన్యంపై చర్య తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ పట్టణ సమితి ఆధ్వర్యంలో స్థానిక ఏఐవైఎఫ్ కార్యాలయం నందు ప్రెస్మీట్ నిర్వహించడం జరిగింది,దీన్ని ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ షాబీర్ భాష మాట్లాడుతూ ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఒకేషనల్ జూనియర్. కళాశాలల యజమాన్యం అప్రెంషిప్ పేరుతో విద్యార్థుల నుండి 5వేల నుంచి పదివేల రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారన్నారు, ప్రభుత్వం నుంచి అప్రెంషిప్ కు ఎలాంటి రుసుములు వసూలు చేయకూడదని నియమ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కుతూ వోకేషనల్ చదువుతున్నటువంటి విద్యార్థుల దగ్గర నుండి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు, చాలామంది పేద విద్యార్థులు మేం కట్టలేము సార్ అంటే కూడా మీరు అప్రెంషిప్ ఫీజు కట్టితేనే మీకు పరీక్షలు రాయడానికి అనుమతి ఇస్తాము, లేకపోతే మీకు హాల్ టికెట్ ఇవ్వము అని విద్యార్థులకు భయప్రాంతాల గురి చేస్తున్నారు. ఒకేషనల్ కోర్స్ పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వమే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ప్రభుత్వం నుండి అప్రెంషిప్ సర్టిఫికెట్ వస్తుంది కానీ కళాశాలల యజమాన్యం మాత్రం విద్యార్థుకు ఆ సర్టిఫికెట్ రావాలంటే మీరు కచ్చితంగా ఐదువేల రూపాయలు చెల్లించాల్సిందే అని విద్యార్థులకు కరాకండిగా చెప్తున్నారు కావున ప్రభుత్వ నియా నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థుల నుండి అప్రెంషిప్ పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్న ప్రవేట్ ఒకేషనల్ జూనియర్ కళాశాలల యజమాన్యంపై చర్యలు తీసుకొని విద్యార్థుల నుండి వసూలు చేసిన వేల రూపాయలు తిరిగి విద్యార్థులకు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కళాశాలల ఎదుట ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి యు దస్తగిరి, పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్, సహాయ కార్యదర్శి మోహన్, ఉపాధ్యక్షుడు వీరేష్, అంజి, రమేష్, తదితరులు పాల్గొన్నారు