పయనించే సూర్యుడు డిసెంబర్ 29 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామం చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాకతీయ కట్టడాలు మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలంలో గుడ్లనర్వ గ్రామంలో నిర్మించిన ప్రాచీన శివాలయం, గత పాలకుల ధ్వంస రచనలో శిథిలావస్థకు చేరుకుంది. దశాబ్దాలుగా వెలవెలబోయిన ఈ ఆలయాన్ని పునరుద్ధరించి, గ్రామానికి ఆధ్యాత్మిక వెలుగులు తీసుకురావాలని గ్రామ యువత, పెద్దలు దృఢ సంకల్పంతో ముందడుగు వేశారు. గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్, మరియు యువకుల సంయుక్త ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ బృహత్తర కార్యక్రమం సాగుతోంది. ఈ పునర్నిర్మాణం ద్వారా కాకతీయ శిల్పకళా వైభవాన్ని మళ్ళీ కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలస్వామి, ఉపసర్పంచ్ శివుడు, గ్రామ పెద్దలు నరసింహ రావు, వెంకట్ రెడ్డి, మేకల శ్రీశైలం. సాగర సంగం గ్రామ అధ్యక్షులు భీమ్ సాగర్. వీరితో పాటు ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు మరియు యువకులైన మేకల లక్ష్మీకాంత్, కోట్ల లింగయ్య, మహేష్ రావు, మేకల అఖిలేష్, కోరుపాల సురేందర్, బిమని రాజు, బీమని రాము, లేట్ల భీమా రావు, లేట్ల మన్యం. వడ్ల రామకృష్ణ. రాందాస్ నాయక్. తదితరులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది యువకులు పాల్గొన్నారు.