పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 29 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ ) మండలంలో తిరుమాలి గ్రామంలో మిరాకిల్ మినిస్ట్రీస్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధినేత పాస్టర్ పి.ప్రవీణ్ పాల్ ఆధ్వర్యంలో 50 మంది, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, కిర్లంపూడి, జగ్గంపేట గండేపల్లి, నాతవరం మండలాల దైవజనులు బట్టలను, దైవజనురాలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా దైవజనులు మీడియాతో మాట్లాడుతూ మిరాకిల్ మినిస్ట్రీస్ అధినేత పి.ప్రవీణ్ పాల్ గత పది సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజుల్లో ఫ్యామిలీ క్రిస్మస్ కార్యక్రమంలో దైవజనులు, దైవజనురాలకు నూతన వస్త్రాలను అందజేస్తున్నారు అన్నారు. ప్రవీణ్ పాల్ బట్టలను అందజేయడం చాలా సంతోషంగా ఉందని,దేవుని కృప ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామన్నారు. అలాగే వివిధ మండలాల దైవజనులు విదేశాలకు వెళ్లి స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రవీణ్ పాల్ ఘనంగా సత్కరించారు. అనంతరం దైవజనులకు, దైవజనురాలకు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జాన్ విల్సన్, కె.పాల్ ప్రసాద్, సంతోష్ కుమార్, జాషువా, సిహెచ్ యోహాన్, జోసఫ్, గిడ్యోన్, పోతుల దొరబాబు, బి.సియన్, రత్నపాల్, వినయ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.