పలాస కాశీబుగ్గ ప్రధాన రహదారులను పరిశీలించిన అధికారులు

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 29 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రధాన రహదారులను ఆదివారం కాశీబుగ్గ డిఎస్పి షేక్ సహబాబ్ అహ్మద్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు పరిశీలించారు. పలాస కాశీబుగ్గ లో, క్రైమ్ ఎక్కువగా ఉండడం వలన పట్టణంలో ఏ ఏ ప్రాంతంలో సీసీ కెమెరాలు అమర్చాలి అన్న విషయంపై వారి చర్చించారు. అంతేకాకుండా పట్నంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ జీబ్రా క్రాసింగ్ మార్కులు ఎక్కడ వేయించాలని వారి పరిశీలన చేశారు. ఫుట్ పాత్ వ్యాపారుల వలన ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఇతర సమస్యలు గూర్చి వారు చర్చించి రోడ్లను కూడళ్లను పరిశీలించి, పట్టణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు వీరితో పటు కాశీబుగ్గ సీఐ ఏ రామకృష్ణ ఉన్నారు.