పయనించే సూర్యుడు న్యూస్ : డిసెంబర్ 29, తల్లాడ రిపోర్టర్ ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా తల్లాడ మండలం బస్వాపురం గ్రామంలో రాజకీయ పార్టీలకతీతంగా ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా పాశం హైమావతి వెంకటేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఈనెల 22వ తేదీన ప్రమాణస్వీకారం మహోత్సవం అనంతరం గురువారం గ్రామ ప్రజల అందరికీ కృతజ్ఞతగా విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలకొడిమ సర్పంచ్ తాత సుమతీ బాయి తోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఎం నాయకులు తాతా భాస్కర్ రావు, శీలం సత్యనారాయణ రెడ్డి, దిరిశాల దాసురావు, దుగ్గిదేవర వెంకటలాల్, ఐలూరి వెంకట కోటారెడ్డి (బాబు గారు), అన్నెం కోటిరెడ్డి, హాజరై సర్పంచ్ హైమావతి వెంకటేశ్వరరావును శాలువాతో సత్కరించి అభినందించారు. గ్రామ అభివృద్ధికి పాటుపడి గ్రామ ప్రజల మన్నలను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో బస్వాపురం ఉపసర్పంచ్ పేటూరి నరసింహారావు, వడ్డే రామారావు, దొబ్బల నరసింహారావు, గంటల వెంకటాచారి, నాయుడు అప్పారావు, గోపిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
