బోయవాడ సమస్యలపై సర్పంచ్ అనితా శ్రీనివాస్ ఆరా

★ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు

పయనించే సూర్యుడు డిసెంబర్ 29 ఉట్నూర్ ఉట్నూర్ మండలంలోని పందిరి భీమన్న వార్డు నెం.5 బోయవాడలో ఉన్న సమస్యలపై ఉట్నూర్ గ్రామ సర్పంచ్ అనితా శ్రీనివాస్ సోమవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె ప్రజలను కోరారు. అలాగే గ్రామ అభివృద్ధిలో యువత ముందుండి భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు గ్రామ సంక్షేమం అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, యువకులు పాల్గొన్నారు.