పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి,సెంటినరీకాలనీ :29 రామగిరి మండలం సెంటినరీకాలనీలో నివాసం ఉంటున్న వలస కార్మికులకు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు చిలువేరు స్వామి తమ సొంత ఖర్చులతో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం,సాయంత్రం వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దీంతో వలస కార్మికులు సరైన వసతులు లేక చలికి తట్టుకోలేక బయటకు రావాలంటేనే భయపడుతున్నారన్నారు.గత నాలుగు సంవత్సరముల నుండి చలికాలం వలస కార్మికులకు 20 నుండి 30 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వెంగళ రాములు, రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.