సింగరేణి విశ్రాంత బొగ్గు పెన్షన్ దారులకు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించడానికి 2026 జనవరి నెలాఖరు వరకు అవకాశం కల్పించాలి

* సీ ఎం పి ఎఫ్ కమిషనర్ కు మరియు సింగరేణి సంక్షేమ అధికారులకు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 29 మందమరి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య సీ ఎం పి ఎఫ్ కమిషనర్ గోదావరిఖని మరియు సింగరేణి పర్సనల్ డిపార్ట్మెంట్ సంక్షేమ అధికారులకు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం తెలియజేసే విజ్ఞప్తి సింగరేణి విశ్రాంత ఉద్యోగులు కోల్ మైన్స్ పెన్షన్ ప్రతినెల పొందేందుకు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో జీవన్ ప్రమాణ లైఫ్ సర్టిఫికెట్ పత్రాలను సీ ఎం పి ఎఫ్ కు సమర్పించే జీవన్ ప్రమాణ పత్రాలు నవంబర్ 2025లో ఆన్లైన్ ద్వారా ఇవ్వాల్సి ఉండగా కానీ చాలామంది సింగరేణి విశ్రాంత ఉద్యోగులు వివిధ జిల్లాలోని మారుమూల పల్లెల్లో గ్రామాల్లో నివసిస్తున్నారు. గతంలో సింగరేణిలో పనిచేసి పదవి విరమణ పొందిన వారు చాలామంది నిరాక్ష రాశులు కావడం, రిటైర్డ్ అయిన తర్వాత చాలామంది అనారోగ్య బారిన పడడం, వారి కుటుంబ సభ్యులు సైతం వారి పనుల్లో పడి లైఫ్ సర్టిఫికెట్స్ తీసుకోకపోవడం, సర్టిఫికెట్స్ తీసుకోవాలని గుర్తు రాకపోవడం తదితర సమస్యలతో జీవన్ ప్రమాణ పత్రాలు తీసుకోకపోవడం జరిగినది అనే విషయాన్ని సవినయంగా మనవి చేస్తున్నాం.అదేవిధంగా మారుమూల పల్లెల్లో ఇంటర్నెట్ కేంద్రాల్లో అవగాహన లేక ఆర్గనైజేషన్,పేయింగ్ అధారిటీ, బ్యాంకు ఖాతా, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ సరిగా పూరించక పోవడంతో తప్పులు దొర్లి గోలేటి, బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్, మంచిర్యాల, శ్రీరాంపూర్, గోదావరిఖని, భూపాలపల్లి వరకు ఉన్న సింగరేణి విశ్రాంత కార్మికులు సుమారుగా విశ్వాసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు 10,490 మంది సింగరేణి రిటైర్మెంట్ కార్మికులు జీవన్ ప్రమాణ లైఫ్ సర్టిఫికెట్ పత్రాలు సమర్పించలేదని విజ్ఞప్తి చేస్తున్నాం. కావున సీ ఎం పి ఎఫ్ కమిషనర్ జీవన్ ప్రమాణ్ పత్రాలు సమర్పించని 10,490 మంది బొగ్గు పెన్షన్ దారులకు 2026 జనవరి చివరి వరకు మరొక అవకాశం ఇవ్వగలరని తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేనియెడల 10,490 మంది సింగరేణి విశ్రాంత బొగ్గు పెన్షన్ దారులకు 2026 ఫిబ్రవరి నెల నుండి వచ్చే కోల్ మైన్స్ పెన్షన్ నిలిచిపోయి విశ్రాంత ఉద్యోగులు అనేక ఆర్థిక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని తమరికి తెలియజేస్తున్నాము..ఈ నెలలో కోల్ మైన్స్ పెన్షన్ దారులు నవంబర్ 2025లో జీవన్ ప్రమాణ లైఫ్ సర్టిఫికెట్ పత్రాలు సీ ఎం పీ ఎఫ్ కు సమర్పించని వారు వెంటనే మీకు అందుబాటులో ఉన్న మీసేవ కేంద్రాలలో లైవ్ సర్టిఫికెట్ ద్వారా జీవన్ ప్రమాణ పత్రాలు తీసుకోగలరని లేనియెడల 2026 ఫిబ్రవరి నెల నుండి మీకు వచ్చే పెన్షన్ నిలిచిపోతదని తెలియజేస్తున్నాము ఈయొక్క వినతి పత్రాన్ని డైరెక్టర్ పా కొత్తగూడెం గారికి, సీ ఎం పీ ఎఫ్ కమిషనర్ గోదావరిఖని గారికి ఫ్యాక్స్ ద్వారా వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. సింగరేణి విశ్రాంత కార్మిక సంఘం అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య రాళ్ళబండి రాజన్న గౌరవ అధ్యక్షుడు పూదరి నర్సయ్య ప్రధాన కార్యదర్శి సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *