“అంగన్ వాడీ వర్కర్లకు 5జీ మొబైల్స్ పంపిణీ

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంగన్ వాడీ వర్కర్లకు బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారని, అందుకోసమే గతంలో అందచేసిన 4జీ మొబైళ్ల స్థానంలో 5జీ మొబైళ్లను అందచేస్తున్నట్లు ఆత్మకూరు ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు ఐసీడీయస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్ వాడీలకు సీడీపీఓ సునీలత ఆధ్వర్యంలో నూతన 5జీ మొబైల్స్ ను ఆయన సోమవారం అందచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి. ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విధులు నిర్వహిస్తున్న అంగన్ వాడీ వర్కర్లకు 5 జీ మొబైల్స్ అందచేయడం జరిగిందని, ఆత్మకూరు క్లష్టర్ పరిధిలో ఆత్మకూరు 92, ఏఎస్ పేట 2, సంగం 52, చేజర్ల 59 మందికి అందచేసినట్లు వివరించారు. ప్రజలకు అందించే సేవలను మొబైల్ ద్వారా ఎప్పటికప్పుడు నమోదు చేయడంద్వారా మరింత పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్ వాడీ కేంద్రాల్లో గ్యాస్ సిలెండర్లు, ఇతర మౌళిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్లు జీ కస్తూరి, పద్మ, శ్రీదేవి, కె మహాలక్ష్మి, అంగన్ వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.